26, డిసెంబర్ 2020, శనివారం
సాటి వారిని ప్రసంశిస్తున్నావా?
23, డిసెంబర్ 2020, బుధవారం
క్రిస్మస్ అంటే ఏమిటి? మూడవ భాగము
పై వచనము అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు యేసు క్రీస్తు వంశావళిని పద్నాలుగు తరములని స్పష్టం చేస్తుంది. అలాగే ఇశ్రాయేలు జనము చరిత్రలో జరిగిన ప్రతి ప్రాముఖ్యమయిన సంఘటనకు ముందు, తర్వాత పద్నాలుగు తరములని తెలుస్తుంది. యేసు క్రీస్తు పూర్తీ వంశావళి అనగా ఆదాము నుండి, యేసయ్య తండ్రిగా చెప్పబడిన, యోసేపు వరకు తెలుకోవటానికి లూకా సువార్త మూడవ అధ్యాయం 23 నుండి చివరి వచనం వరకు చూడవచ్చు. అయితే దావీదు "తల్లి గర్భము నందే నేను పాపములో ఉన్నాను" అని రాసినప్పుడు, మానవ శరీరంలో తల్లి గర్భము నుండి ఏర్పడిన యేసయ్యకు పాపం ఎలా అంటలేదు?
యేసు క్రీస్తుకు ముందు దేవుడు మోషే ద్వారా ధర్మ శాస్త్రమును రాయించి దానిని పాటిస్తూన్న వారిని నీతిమంతులుగా పరిగణించాడు. పాపం చేసిన వారికి ప్రాయశ్చిత్తంగా వారి తరపున బలులను అర్పించే ప్రధాన యాజకులను నియమించి, వాటి రక్తం ద్వారా వారి పాపలకు ప్రాయశ్చిత్తమును అంగీకరించాడని రెండవ భాగంలో తెలుసుకున్నాం. అయినప్పటికి దారి తప్పిపోతున్న ప్రజలను నిత్యమూ హెచ్చరించటానికి తాను ఎన్నిక చేసుకున్న కొంతమంది భక్తులను తన ప్రవక్తలుగా ఏర్పరచుకొని, వారి ద్వారా ప్రజలతో మాట్లాడాడు. అటువంటి ప్రవక్తలలో యెషయా ఒక్కరు. మొదటి భాగంలో ఈయన రాసిన దేవుని వాక్యం నుండే మనం సాతాను గురించి తెలుకున్నాం. యేసు క్రీస్తును గురించి ఏడు వందల సంవత్సరాలకు ముందే అయన పుట్టుకను గురించి ఈయన ప్రవచించాడు.
యెషయా 9: "6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును."
యేసు క్రీస్తును మరియ కన్యకగా ఉన్నపుడే గర్భము దాల్చిందని స్పష్టమయింది. దేవుని శక్తి ద్వారా మానవ ప్రమేయం లేకుండా అనగా యేసు తండ్రిగా పరిగణింపబడిన యోసేపు మరియను కూడక ముందే ఆమె గర్భవతిగా అయింది. దానిని బట్టి యేసయ్యకు జన్మతః పాపము లేదు. అయితే మానవ శరీరము పాపముతో నిండుకున్నదని నేర్చుకున్నాము కదా! మరి యేసయ్యకు అలాగయినా పాపం అంటుకోవాలి కదా?
22, డిసెంబర్ 2020, మంగళవారం
క్రిస్మస్ అంటే ఏమిటి? రెండవ భాగము
మొదటి భాగము కోసం ఇక్కడ నొక్కండి
ఆదికాండము 3: "16. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను. 17. ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;"
ఆదాము, అవ్వలు సాతాను అబద్దాలను నమ్మి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత దేవుడు ఆ పాపమును బట్టి సర్పమును శపించి అవ్వను శిక్షించాడు అదే విధంగా ఆదామును బట్టి భూమిని శపించాడు. ఆ తరుణంలో దేవుడు మానవాళి పట్ల తానూ నెరవేర్చబోయే వాగ్దానమును సెలవిచ్చి యున్నాడు.
ఆదికాండము 3: "15 మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను."
పై వచనములో స్త్రీ సంతానము యేసు క్రీస్తును ఉద్దేశించి చెప్పిన మాటలు. ఇవే మాటలను అపొస్తలుడయినా పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో వివరించారు.
గలతీయులకు 4: "4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి, 5. మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను."
పై వచనము స్పష్టము చేస్తున్న విషయము ఏమిటీ? దేవుడు మానవాళికి వాగ్దానము చేసినట్లుగా తన కుమారుణ్ణి, యేసు క్రీస్తును, ఈ లోకమునకు పంపి ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. తద్వారా ఆయనను నమ్మిన వారందరికి అయన నీతి వర్తించేలాగున ఆయనను అనుగ్రహించాడు. ఈ విషయాలను మరింత బాగా స్పష్టం చేసే ముందు, మొదటి భాగములో చెప్పిన దేవుని నియమాలు ఏమిటి? వాటిని చూసే ముందు ఇశ్రాయేలు జనమును గురించి తెలుకోవటం అవసరం.
గలతీయులకు 3: "6. అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను. 7. కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి. 8. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖ నము ముందుగా చూచినీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. 9. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు."
పై వచనములో ఉన్న ఈ అబ్రాహాము గారు అప్పుడు ఉన్న ప్రజలకు పూర్తిగా భిన్నమయిన వ్యక్తి. విగ్రహారాధనను వ్యతిరేకించి తన విశ్వాసముతో దేవుణ్ణి అనుసరించి అయన అనుగ్రహం పొందిన వాడు. సంతానము లేని తనకు దేవుడు ఇచ్చిన వాగ్దానము "నీ సంతానమును గొప్పగా విస్తరింపజేస్తానని, సముద్రములో ఇసుక రేణువులంతగా అయన సంతానము ఉంటుందని". తన వాగ్దానము ప్రకారము దేవుడు అబ్రాహాముకు ఇస్సాకు అనబడే కుమారుని అనుగ్రహించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, వారిలో చిన్నవాడు యాకోబు. ఈ యాకోబు దేవునితో పెనుగులాడి ఆశీర్వదింపబడ్డాడు. అందునుబట్టి దేవుని తో ఇశ్రాయేలు అని పిలవబడ్డాడు.
ఆదికాండము 32: "28. అప్పుడు ఆయననీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను."
ఈ ఇశ్రాయేలుకు / యాకోబుకు పన్నెండుమంది కుమారులు, వారి ద్వారానే ఇశ్రాయేలు జనములో గోత్రాలు ఏర్పడ్డాయి. ఇశ్రాయేలు జనమును దాస్యము లో నుండి విడిపించిన తర్వాత దేవుడు కొన్ని గోత్రములకు విధులను సూచించాడు. అయితే వారిలో లేవియులు యాజకత్వము చేయాలనీ దేవుని నిర్ణయము. ఈ లేవీయులు దేవుని మందిరములో ఉంటూ ప్రజలు తెచ్చే పాప పరిహారములను వారి తరపున దేవునికి బలులుగా అర్పించేవారు. దేవుడు ప్రతి పాపమునకు ఎటువంటి బలి అర్పించాలన్న నిబంధనలు రాయించాడు.
లేవీయకాండము 17: "11. రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును."
హెబ్రీయులకు 9: "1. ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును. 2. తానుకూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు. 3. ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు."
పై వచనములు స్పష్టం చేస్తున్నది ఏమిటి? రక్తము చిందితేనే పాపమునకు క్షమాపణ. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలు జనములో లేవి వంశము నుండి ఒక ప్రధాన యాజకుడు తన పాపములను బట్టి ప్రాయశ్చిత్తము చేసుకొని తర్వాత ప్రజల పాపమూ నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేస్తాడు. తద్వారా వారి పాపములకు దేవుని యెదుట ప్రాయశ్చిత్తము చెల్లించి క్షమాపణ పొందారు అప్పటి ప్రజలు.
హెబ్రీయులకు 2: "14. ......మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, 15. జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. 16. ఏల యనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు."
పై వచనంలో మరణ బలము గలవాడు అనగా అపవాది అంటే మొదటి భాగములో చెప్పుకున్న సాతాను. అనగా అహంకారము చేత దేవునికి లోబడక నరకమునకు అణగద్రొక్కబడ్డవాడు. వాడిని మరణము ద్వారా నశింపజేయటానికి, మరణ భయము చేత అనగా పాపమూ ద్వారా వచ్చే దాని చేత పీడింపబడుతున్న వారిని విడిపించుఁటకు అబ్రాహాము సంతానంగా అనగా మానవునిగా అవతరించాడు. ఆపై మరణము పొంది తానూ చేసిన శాసనము చెల్లుబాటు చేశాడు అని క్రింది వచనముల ద్వారా స్పష్టం అవుతుంది.
హెబ్రీయులకు 9 : "16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. 17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?"
మరియు ప్రధాన యాజకులు చేసే ప్రాయశ్చిత్తము కంటే, పాపమూ లేని యేసు క్రీస్తు రక్తము ఒకేసారి మానవాళికి పాప క్షమాపణ అనగా మరల, మరల అవే బలులు అవసరం లేనంతగా పాపమును రద్దు చేసిందని క్రింది వచనముల ద్వారా మనకు అవగతమవుతుంది.
అయితే మొదటి భాగము లో మనం నేర్చుకున్న ముఖ్యమయిన అంశము, ప్రతి వాడు పాపం చేసియున్నాడు, తల్లి గర్భమందే మనలను పాపం ఆవరించిందని. ఆదాము అవ్వల ద్వారా మనం పొందుకున్న శరీరం పాపంతో నిండుకున్నదని తెలుసుకున్నాం. మరి మనిషిగా పుట్టిన యేసు క్రీస్తు పాపంలేని వాడిగా ఎలా పరిగణింపబడ్డాడు? అయన కూడా మానవ శరీరంలోనే ఈ భూమి మీదికి వచ్చాడు కదా! వచ్చే భాగంలో దేవుని చిత్తను సారముగా తెలుసుకుందాం. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!