దేవుడు మనలను నిత్యము పవిత్రులుగా ఉండాలని కొరుకుంటున్నాడు అని దేవుని వాక్యం మనకు చెపుతుంది. అందుకని ఇశ్రాయేలు వారికి మోషె ద్వారా పది అజ్ఞలు ఇచ్చి వారిని పాపం చేయకుండ చూడలనుకున్నాడు. పాపంలొ పడిపోతె పాప పరిహారార్ధ బలులు చేసే నిబంధన ద్వారా వారి పాపములు క్షమించాడు. అయితే యేసయ్య వచ్చిన తర్వాత పది అజ్ఞల స్థానంలొ కొత్త భొధలు మొదలయినయి. వ్యభిచారం చేయరాదు అన్న అజ్ఞ స్థానంలొ మొహపు చూపే వ్యభిచారముగా మారిపొయింది. నర హత్య చేయరాదు అన్న అజ్ఞ, స్థాయిని పేంచుకొని కోపపడటమె హత్యగా మారిపొయింది. ఎందుకని యేసయ్య ఇటువంటి అజ్ఞలు ఇచ్చాడు?
మన శరిరము బలహీనమయినదని అయనకు తెలుసు, కనుకనే దానికి ఎటువంటి శొధించబడె అవకాశం ఇవ్వరాదని అనుకున్నాడు. అంతె కాకుండా రోగం వచ్చినప్పుదు మందు తీసుకొవటం కన్న రొగం రాకుండా నియంత్రించలనుకున్నాడు. అందుకని ఇటువంటి అజ్ఞలు ఇచ్చి మనలను పవిత్రంగా ఉంచాలని మనకు భోదించాడు. మరియు పరిశుద్దాత్మ శక్తిని పొందుకోని అటువంటి జీవితమును కొనసాగించి, మనకు మాదిరిగా ఉన్నాడు. మనం కూడా పరిశుద్దాత్మ శక్తిని పొందుకొని అటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలొ ఉన్న ఎన్నొ విషయాలు మనకు ఉదాహరణలుగా ఉండాలని దేవుడు రాయించాడు. అన్యజనులను ఇశ్రాయేలు వారి మధ్య నుండి వెళ్ళగొట్టాలని నాయకులకు, రాజులకు అజ్ఞపిస్తు వచ్చాడు. కానీ వారు వివిధ రకాలైన కారణాలు చెప్పి, దేవుని అజ్ఞను తృణికరించారు. కనుకనే అన్యజనుల చేడు అలవాట్లు నేర్చుకొని దేవుని అగ్రహానికి గురి అయినారు.
2 దినవృత్తాంతములు 8: "7. ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు అమోరీయులలోనుండియు, పెరిజ్జీయులలో నుండియు, హివ్వీయులలోనుండియు, యెబూసీయులలో నుండియు, శేషించియున్న సకల జనులను 8. ఇశ్రాయేలీ యులు నాశనముచేయక వదలివేసిన ఆ యా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టిపనులు చేయువారినిగా చేసికొనియుండెను."
ఈ వచనములొ సొలొమోను గారు దేవుడు నశింపచెయమన్న అన్య జనులను బానిసలుగా పెట్టుకున్నట్లుగా చూడవచ్చు. ఈ జనులను దేవుడు యెహొషువ కాలం నుండి కూడ నశింపచేయాలని అజ్ఞపిస్తు వచ్చాడు, కాని ఇశ్రాయేలు వారు వారి చేత పనులు చేయించుకొవచ్చు అన్న నెపంతొ వారిని తమ మధ్య నివాసం చేసెలా అనుమతించారు. ఇదివరకు మనం పక్కవారితొ మనకు కలిగే అత్మీయ ఇబ్బందులను ధ్యానించుకున్నాము. అదే విధంగా మనకు ఉన్న చిన్న చిన్న అలవాట్లు కూడా మనలను అత్మీయతలొ వెనుకపడెలా చేస్తాయి. ఇక్కడ ఇశ్రాయేలు వారు, మనకు బానిసలుగా ఉన్నవారు మనలను ఏం చేస్తారు అనుకోని ఉంటారు. అదే విధముగా మనకు ఉండే అల్పమయిన అలవాట్లు అంత ప్రమాదకారం కాదులే అని మనం అనుకోవచ్చు. కానీ ఆ అలవాట్లే దీర్ఘ కాలంలో మనలను శోధించి, దేవునికి దూరంగా తీసుకెళ్తాయి.
దేవుని వాక్యంలో చెప్పినట్లుగా సాతాను, "ఎవరిని మింగుదునా" అని గర్జించే సింహంలాగా ఎదురు చూస్తున్నాడు. మనం ఫోన్ లో చూసే ఆ వీడియోలు, మన ఆలోచనలు కలుషితం చేయవచ్చు. చదివే ఆ పిచ్చి వార్తలు దేవుని వాక్యం మర్చి పోయేలా చేయవచ్చు. దేవుణ్ణి ఎరుగని జనంతో స్నేహము, మన పాత జీవితం వైపు మనలను లాగవచ్చు. ఊరికే సినిమా పాటలు విందాం అనుకునే ఆ అలవాటు, దేవున్నీ మనం ఆరాధించే సమయాన్ని తగ్గించి వేయవచ్చు. అత్మీయపరంగా మనలను శోధించి, దేవునికి మనలను దూరం చేసే ప్రతి అలవాటు మానుకోవటం దేవునికి ఇష్టమయిన కార్యము. కనీసం సెల్ ఫోన్ కూడా చుడ్దోద్దా? సంగీతం వింటే మరి అంత నష్టం కలుగుతుందా, అనుకునే వారు ఒక్కసారి ఈ వచనము చూడండి.
1 కొరింథీయులకు 6: "12. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను."
మనకు అన్ని చేయటానికి స్వేచ్ఛ ఉంది, కానీ అన్ని కూడా మనకు మేలును కలిగించవు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అది ఎంత చిన్నదయినా, పెద్దదయినా మనకు మేలును కలిగించే పనులను మాత్రమే చేయాలి. దేవుడు మన శరీరమును వెల పెట్టి కొన్నాడు, మనం మన సొత్తు కాదు గాని, పరిశుద్దాత్మ నివసించే దేవాలయము. కాబట్టి మనము మన దేహము ద్వారా ఆయనను మహిమ పరచాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. మనలను శోదిస్తూ, అపవిత్రంగా మార్చబోయే అలవాట్లు నిమిషం పాటు కొనసాగించిన అవి మన ఆత్మీయతను తగ్గిస్తాయి.
కీర్తనలు 106: "34. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. 35. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. 36. వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను."
ప్రియమయిన సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఈ వచనము చూడండి. దేవుడు నాశనం చెయ్యమన్న అన్య జనులను ఇశ్రాయేలు వారు నాశనం చెయ్యకుండా, వారిని బానిసలుగా ఉంచుకొని చివరకు వారి అలవాట్లు పాటించే వారిగా మారిపొయారు. వారిలాగే విగ్రహలను ఆరాధిస్తు వాటి ద్వారానే నశించిపొయారు అని దేవుని వాక్యం స్పష్టంగా చెపుతొంది. నీ చేతిలొ ఉన్న ఆ సెల్ ఫొన్ నీకు బానిసగా ఉందనుకుంటున్నావా? దాని ద్వారా పనులు తెలికగా అయిపొతున్నాయి అని సంబరపడుతున్నావా? టెక్నలజి వాడటం మంచిదే, కాని అది మనలను తనకు బానిసగా చేసుకొనంత వరకు మాత్రమె అయితే ఇంకా బాగుంటుంది.
నువ్వు చదివే ఆ సినిమా రివ్యూలు నిన్ను ఏ విధముగా అత్మియతలో బలపరుస్తాయి అలొచించి అడుగులు వేయు. నవ్వు కొవటానికి నువ్వు చూసే ఆ టివి ప్రోగ్రాం నిన్ను సాతాను ముందు నవ్వుల పాలు కాకుండా చూసుకో. చిన్న అలవాటె కదా, ఇది నన్నెం చేస్తుంది అన్న నిర్లక్ష్యం వద్దు. సాతానుకు ఒక్క చిన్న అవకాశం చాలు మనలను దేవునికి దూరం చేయటానికి. మనలను అపవిత్రంగా మార్చి మన అత్మీయతను దెబ్బ తియ్యటానికి.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము, అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!
Good brother
రిప్లయితొలగించండి