పేజీలు

2, మార్చి 2024, శనివారం

యేసయ్య ప్రేమ!

ఏ మంచి లేని, ఎందుకు పనికి రాని నన్ను
ఎన్నుకోవటం ఏమిటయ్యా?

క్షణ కాలం నీకు నచ్చినట్లు ఉండలేని వాడి కోసం
ఈ ఆరాటం దెనికయ్యా?

నా కోసం పోరాడుతూనే ఉన్నావు, నేను ఓడిపోతూనే ఉన్నాను
కొంచెమయినా కోప్పడవేంటయ్యా!

తప్పు నేను చేసి నింద నీ మీదేస్తాను, నన్నేదో శిక్షిస్తున్నావని అనుమానిస్తాను
అయినా కూడా బుజ్జగిస్తావేంటయ్యా!

ఏది కావాలన్నా నిన్నే అడుగుతాను, కాస్తా ఆలస్యం అయితే
అన్ని మర్చిపోయి నిన్నే శంకిస్తాను ఏ మాత్రం నొచ్చుకోకుండా కోరింది ఇచ్చేస్తావ్!
ఇది వింత కాకపోతే ఇంకేంటయ్యా!

ఇంత ప్రేమను పొందే అర్హత నాకు లేదని నీకు మాత్రం తెలియదా!
అయినా నన్ను విడిచిపోవు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి